నేడు కేందమంత్రుల్ని కలవనున్న  కేసీఆర్

 నేడు కేందమంత్రుల్ని కలవనున్న  కేసీఆర్

 

విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. అలాగే, ఓ వివాహ వేడుకకు హాజరుకానున్నారు కేసీఆర్‌. ఈ సందర్భంగా ఏపీ విభజనలో భాగంగా తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో సమస్యలపై కేంద్రంతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి. ప్రధానితో భేటీలో తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు సహా విభజన హామీలపై ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా, రక్షణ శాఖ భూముల కేటాయింపు వంటి కీలక అంశాలపైనా చర్చ జరగనుంది. అదే విధంగా కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్‌ గడ్కరీలను కూడా కలవనున్నారు తెలంగాణ ము ఖ్యమంత్రి. అంతేకాక పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీవ్ శర్మ ఇంట్లో జరిగే వివాహ వేడుకలో కూడా పాల్గోని, వధూవరులను ఆశీర్వదించనున్నారు సీఎం కేసీఆర్‌.