రేపు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్..

రేపు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్..

రేపు ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ కాళేశ్వరం వెళ్లనున్నారు. హెలికాప్టర్లో మేడిగడ్డ చేరుకోనున్న సీఎం కేసీఆర్, రిజర్వాయర్లో నీటిమట్టం 100 ఎఫ్ఆర్ఎల్ కు చేరుకోవడంతో మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించనున్నారు. బ్యారేజ్ పరిసరాల్లో అధికారులతో కలిసి సుమారు 4 గంటల పాటు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరే ముఖ్యమంత్రి కేసీఆర్ లంచ్ కూడా చేయనున్నారు. ఆ తరవాత హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు. నిజానికి ఆయన అక్కడికి వెళ్లి ఏడాది పూర్తయింది.