థర్మల్ పవర్ ప్రాజెక్టును పరిశీలించిన కేసీఆర్

థర్మల్ పవర్ ప్రాజెక్టును పరిశీలించిన కేసీఆర్

రామగుండంలోని ఎన్టీపీసీ పవర్‌ప్లాంట్‌ ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చేరుకున్న కేసీఆర్ ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ లో సీఎండీ గుర్దీప్ సింగ్ తో భేటీ అయ్యారు. అనంతరం రామగుండంలో కొత్తగా 1600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న పవర్‌ ప్లాంట్‌ వద్దకు చేరుకొని పనుల్లో పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుర్‌దీప్‌ సింగ్‌తో కలిసి ఆయన పవర్‌ప్లాంట్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. సీఎం కేసీఆర్‌ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ వెంట సీఎస్‌ ఎస్కే జోషీ, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ రాత్రికి కరీంనగర్‌లోనే సీఎం బస చేయనున్నారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా స్తారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ముక్తేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు,కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు.