ఆస్పత్రిలో చేరిన దాదా.. ఆందోళన వ్యక్తం చేసిన దీదీ..
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఆస్పత్రిలో చేరారు.. ఇవాళ ఉదయం కోల్‌కతాలోని తన ఇంట్లోని వ్యాయామం చేస్తుండగా చాతీలో నొప్పి రావడంతో విలవిల్లాడిపోయారు దాదా.. దాంతో.. హుటాహుటిన గంగూలీని ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. సౌరవ్‌కు గుండెపోటు వచ్చినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఈ వార్త ఒక్కసారిగా గంగూలీ ఫ్యాన్స్‌ను, క్రికెట్ ప్రేమికులను, క్రీడాభిమానులకు షాక్‌కు గురిచేసింది.. దాదా త్వరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతు్నారు.. ఇక, సౌరవ్ ఆరోగ్యంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా స్పందించారు.. గంగూలీ అనారోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె.. ‘‘గంగూలీకి గుండెపోటు వచ్చిందన్న వార్త విని చాలా బాధపడ్డాను.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.. ఈ సమయంలో గంగూలీ కుటుంబానికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను''అంటూ ట్వీట్ చేశారు మమతా బెనర్జీ.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)