'నన్ను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చారు'

'నన్ను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చారు'

తనను హత్య చేసేందుకు భారీ కుట్ర జరుగుతోందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తొలుత తనను వ్యక్తిగతంగా దెబ్బతీసి...తరవాత భౌతికంగా అడ్డు తొలగించుకోవడానికి ఓ రాజకీయ పార్టీ కుట్ర చేసిందని ఆమె అన్నారు. జాతీయ రాజకీయాల్లో మమత ఇటీవల కీలక పాత్ర వహిస్తున్న విషయం తెలిసిందే.  జీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సంచలన ఆరోపణలు చేశారు. 'ఓ రాజకీయ పార్టీ నన్ను చంపేందుకు కుట్ర పన్నింది. తొలుత వ్యక్తిత్వాన్ని  దెబ్బతీయడం...  ఆ తర్వాత భౌతికంగా  తొలగించుకోవడం ఆ కట్ర వ్యూహం' అని మమతా అన్నారు. ఇప్పటికే ఆ పార్టీ సుపారీ మాట్లాడి, అడ్వాన్స్ కూడా ఇచ్చిందని ఆమె  కిరాయి హంతకులు తన ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించారని మమతా వెల్లడించారు. అయితే ఆమె ఆ రాజకీయ పార్టీ పేరు మాత్రం వెల్లడించలేదు.