ప్రజ్ఞేశ్‌కు రూ.20 లక్షల నజరానా

ప్రజ్ఞేశ్‌కు రూ.20 లక్షల నజరానా

ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన తమిళనాడుకు చెందిన టెన్నిస్‌ ఆటగాడు ప్రజ్ఞేశ్‌ గుణేశ్వరన్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ప్రజ్ఞేశ్‌కు రూ.20 లక్షలు నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు తమిళనాడు సీఎం పళనిస్వామి తెలిపారు. ప్రజ్ఞేశ్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో డెన్నిస్‌ ఇస్తోమిన్‌తో జరిగిన సెమీస్‌లో 2-6, 2-6 తేడాతో ఓడి కాంస్యం గెలిచాడు.