వైఎస్‌ ఘాట్‌లో సీఎం జగన్ నివాళులు..

వైఎస్‌ ఘాట్‌లో సీఎం జగన్ నివాళులు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు వైసీపీ నేతలు. ఇక ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ లో ఏపీ సీఎం, వైఎస్ కుమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంజలి ఘటించారు. ఆయనతో పాటు వైఎస్సార్‌ సతీమణి వైఎస్‌ విజయమ్మ, వైఎస్ కుటుంబసభ్యులు, వైఎస్‌ భారతి రెడ్డి, షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం వైఎస్సార్ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.