మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవేనా..?

మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవేనా..?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీమ్ రెడీ అయ్యింది... సీఎం జగన్ టీమ్‌కు చెందిన 25 మంత్రులతో వెలగపూడిలోని సచివాయలంలో ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ నరసింహన్. మంత్రులుగా ధర్మాన కృష్ణదాస్‌, బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్), పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పినిపె విశ్వరూప్‌, కురసాల కన్నబాబు, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పేర్ని వెంకట్రామయ్య (నాని), మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.నారాయణస్వామి, అంజద్‌ బాషా, యం. శంకరనారాయణగా ప్రమాణం చేయగా... ఇప్పుడు ఎవరికి ఏ శాఖలు కేటాయస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రి పదవులు వీరికి కేటాయించాలనే నిర్ణయానికి వచ్చినప్పుడే... సీఎం జగన్.. శాఖలు కూడా కేటాయించారని తెలుస్తోంది. విశ్వాసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మంత్రులకు ఈ శాఖలు కేటాయించే అవకాశం ఉంది. 
1. పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి: గనుల శాఖ, పంజాయతీరాజ్ శాఖ
2. మేకతోటి సుచరిత: హోంశాఖ
3. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి : ఆర్థికశాఖ, శాసనసభా వ్యవహారాలు
4. తానేటి వనిత: సాంఘిక సంక్షేమ శాఖ లేదా స్త్రీ, శిశు సంక్షేమశాఖ
5. కె.నారాయణస్వామి: సాంఘిక సంక్షేమశాఖ
6. పాముల పుష్ప శ్రీవాణి: గిరిజన సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)
7. పిల్లి సుభాష్ చంద్రబోస్: బీసీ సంక్షేమశాఖ (డిప్యూటీ సీఎం)
8. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి : భారీ నీటిపారుదలశాఖ లేదా రోడ్డు, భవనాల శాఖ
9. కొడాలి నాని: రవాణాశాఖ
10. ఆంజాద్ బాషా : మైనార్టీ సంక్షేమం (డిప్యూటీ సీఎం) ఇస్తారనే చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రానికి మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.