సీఎం జగన్‌ తొలి సంతకం ఈ ఫైళ్ల పైనే..

సీఎం జగన్‌ తొలి సంతకం ఈ ఫైళ్ల పైనే..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి తన ఛాంబర్‌లో అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు కీలక ఫైల్స్‌పై తొలిసంతకం చేశారు. ఉదయం తాడేపల్లి నుంచి బయల్దేరి సచివాలయానికి చేరుకున్న ఏపీ సీఎం.. తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం, ఆశా వర్కర్ల జీతాల పెంపుపై సీఎం జగన్ తన తొలి సంతకం చేశారు. అనంత ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్ర అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. జర్నలిస్టుల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రిన్యూవల్ చేస్తూ మూడో సంతకం చేశారు. కాగా, ఆశా వర్కర్ల జీతాలను రూ.10 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.