బాధ్యతలు స్వీకరించిన సీఎం జగన్...

బాధ్యతలు స్వీకరించిన సీఎం జగన్...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో అడుగుపెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... వెలగపూడిలోని ఏపీ సచివాలయం మొదటి బ్లాక్‌లో సీఎం చాంబర్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు వేద పండితులు. అనంతరం తన ఛాంబర్‌లో తొలి సంతకం చేసి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా సచివాలయం ఉద్యోగులు, కొత్తగా ఎంపికైన మంత్రులు, అధికారులు, వైసీపీ నేతలు సీఎం జగన్‌ను కలిసి అభినందనలు తెలిపారు.