'హోదా'పోరాటం కేసులు ఎత్తివేత..!

'హోదా'పోరాటం కేసులు ఎత్తివేత..!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా..! ప్రత్యేక ప్యాకేజీ! పరిస్థితి ఎలా ఉన్నా... రాష్ట్రానికి స్పెషల్ కేటగిరి స్టేటస్ కావాలంటూ ఆందోళనలు, నిరసనలు, బంద్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే, ప్రజావేదికలో జరుగుతోన్న కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, ఉన్నతాధికారుల సమావేశంలో హోదా ఉద్యమ కేసుల ప్రస్తావన వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ఆదేశించారు. హోదా కోసం పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలన్నారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో హోదా పోరాటంలో పాల్గొని కేసులపాలైన వారికి ఊరట లభించనుంది.