నేను గనుక డోర్ తెరిస్తే...

నేను గనుక డోర్ తెరిస్తే...

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారం ఎన్నిక సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను టీడీపీలో చేర్చుకోవడంపై ధ్వజమెత్తిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. నేను గనుక డోర్ తెరిస్తే... టీడీపీ సభ్యులంతా వైసీపీలోనేనని... చంద్రబాబు చేసినట్టు నేనూ నలుగురికి మంత్రి పదవి ఇస్తే టీడీపీలో ఎవరూ మిగలరని.. మాతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని వెల్లడించిన సీఎం జగన్.. కానీ, చంద్రబాబు చేసిన పని నేను చేయబోనన్నారు. సభలో ప్రతిపక్షం ఉండాలని... కొత్త సంప్రదాయం రావాలని.. మంచి చేయాలని ఆలోచిస్తే దానిపై కూడా ప్రతిపక్షం అన్యాయంగా మాట్లాడుతోందని మండిపడ్డ జగన్... 23 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను అన్యాయంగా టీడీపీలో చేర్చుకున్నారు.. దేవుడు ఉన్నాడు.. గువ్వ గుయ్యిమనేలా కొట్టాడు.. 23వ తేదీన 23 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను ఆ పార్టీకి ఇచ్చారని వ్యాఖ్యానించారు. కనీసం సంప్రదాయాలు మారాలని చట్టసభల్లో మాట్లాడితే దానిని వక్రీకరించడం చూస్తే... కుక్కతోక ఎప్పుడూ వంకరే అని అనిపిస్తోంది అంటూ ప్రతిపక్షాన్ని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్.