గవర్నర్‌తో నేడు సీఎం జగన్ భేటీ..

గవర్నర్‌తో నేడు సీఎం జగన్ భేటీ..

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో ఇవాళ సమావేశం కానున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గవర్నర్‌ నరసింహన్‌ ఇవాళ విజయవాడకు రానుండగా.. ఆయన బస చేసే హోటల్‌కు వెళ్లి గవర్నర్‌ను మర్యాద పూర్వకంగా కలవనున్నారు సీఎం జగన్. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంపై గవర్నర్ నరసింహన్‌తో సీఎం వైఎస్ జగన్ చర్చించే అవకాశం ఉంది.