వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్‌ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను ఖరారు చేశారు. కాగా, ఇప్పటికే ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నెల 14వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మూడు స్థానాలను సంఖ్యాబలంతో వైసీపీ కైవసం చేసుకోనుంది. ఇక, ఎమ్మెల్సీ అభ్యర్థులపై సీఎం వైఎస్ జగన్.. పార్టీలోని కీలక నేతల అభిప్రాయాలను తీసుకున్న సంగతి తెలిసిందే.