ఆనంపై జగన్ సీరియస్... హద్దు దాటితే వేటే..?

ఆనంపై జగన్ సీరియస్... హద్దు దాటితే వేటే..?

నెల్లూరు రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. వైసీపీలో నేతల మధ్య కుంపటి రాజకీయాలు... టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు.. ఇలా పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా.. నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రౌడీలూ గుండాలూ ఎక్కువయ్యారు... ప్రజలు మనోవేదనకు గురవుతున్నారు... భూకబ్జాలూ... సెటిల్‌మెంట్లూ పెరిగిపోయాయంటూ వైసీపీ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.. వ్యక్తిగత ఆధిపత్యం ప్రదర్శిస్తే వేటు తప్పదదని జగన్ హెచ్చరించారు. అవసరమైతే సస్పెండ్ చేయండంటూ పార్టీ నేతలకు ఆదేశించారు సీఎం జగన్. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు వైసీపీ అధినేత. 

కాగా, ఇటీవల రేణిగుంట ఎయిర్‌పోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆనం భేటీ అయ్యారని వైసీపీ అధినేతకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. మరోవైపు శనివారం వైసీపీలో చేరారు టీడీపీ నేత బీద మస్తాన్‌రావు.. ఈ సందర్భంగా ఆన వ్యాఖ్యలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆనం వ్యాఖ్యలపై సీఎం జగన్ గుర్రుగా ఉన్నారు. ఇక, బీద మస్తాన్‌రావు చేరికను పార్టీలోని సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా.. కొందరికి చెక్ పెట్టేందుకు జగన్.. ఈ నిర్ణయానికి వచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అవసరమైతే సస్పెండ్ చేయండంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు... ఆనంను సాగనంపాలనే నిర్ణయానికి వచ్చే చేస్తున్నారనే టాక్ కూడా నడుస్తోంది. ఓవైపు ఇతర  పార్టీలకు చెందిన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న తరుణంలో సొంతపార్టీ ఎమ్మెల్యే ఆనం బహిరంగంగా మీడియాకు ఎక్కడం పార్టీ అధినేతకు మింగుడుపడడంలేదంటున్నారు.