సీఎం జగన్ ప్రజాదర్బార్..

సీఎం జగన్ ప్రజాదర్బార్..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు చూపిస్తున్నారు. ఓ వైపు సమీక్షలు, అధికారులతో భేటీలు, మంత్రులకు దిశాదిర్దేశం చేస్తూనే.. మరోవైపు ప్రజలతో మమేకం అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీనికోసం త్వరలోనే ఏపీ సీఎం జగన్ ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ ఉదయం 30 నిమిషాల పాటు ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించనున్నారు సీఎం జగన్. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల మొదటివారం నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంను కలిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి... వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పెద్దఎత్తున తరలివస్తుండడంతో.. సెక్యూరిటీ నిబంధనలు అడ్డొస్తున్నాయి. దీంతో ప్రజాదర్బార్‌లో ప్రజలను కలుసుకోనున్నారు ఏపీ ముఖ్యమంత్రి. కాగా, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఇదే తరహాలో ప్రజా దర్భార్‌తో ప్రజలతో మమేకమైన సంగతి తెలిసిందే.