రేపు మరోసారి ఢిల్లీకి సీఎం జగన్

రేపు మరోసారి ఢిల్లీకి సీఎం జగన్

ఏపీ సీఎం జగన్‌ రెండు రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. నిన్న ప్రధాని మోడీతో సమావేశమై రాష్ట్రానికి తిరిగివచ్చిన ఆయన అమిత్‌షాతో భేటీ అయ్యేందుకు రేపు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు సాయంత్రం ఆరు గంటలకు అమిత్‌షాతో జగన్‌ భేటీ కాబోతున్నారు. మండలి రద్దుతో పాటు ఏపీ అంశాలపై చర్చిస్తారని అంటున్నారు. నిజానికి ఆయన ఈరోజే అమిత్ షాను కలవ వలసి ఉన్నా ఆయన ఢిల్లీ ఫలితాలపై సమీక్షలో బిజీగా ఉండటంతో విజయవాడకు వెనుదిరిగారు. అపాయింట్‌మెంట్‌ను రీషెడ్యూల్ చేసిన కేంద్ర హోం శాఖ ఈరోజే సీఎం జగన్ కు కబురు పంపింది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు కేంద్ర హోం శాఖ ఆమోదం తప్పనిసరి కావడంతో భేటీలో అదే విషయం ప్రధానం అజెండా అని తెలిసింది. దాంతోపాటు మండలి రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం, ఏపీకి ప్రత్యేక హోదా, పెండింగ్ నిధుల విడుదల, సీబీఐ కేసుల విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అంశాలను కూడా జగన్ ప్రస్తావిస్తారని సమాచారం.