యుపిఏ హయాంతో పోలిస్తే తగ్గిన కొత్త పెట్టుబడి ప్రతిపాదనలు

యుపిఏ హయాంతో పోలిస్తే తగ్గిన కొత్త పెట్టుబడి ప్రతిపాదనలు

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో లోక్ సభ ఎన్నికల పర్వం ఏప్రిల్ 11న జరిగిన మొదటి దశ ఓటింగ్ తో ప్రారంభమైంది. దేశాన్నంతా ఎన్నికల ఫీవర్ పట్టి ఊపేస్తోంది. పార్టీల మేనిఫెస్టోలు, విధానాలు ఇప్పుడు చర్చల్లో నలుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతిపాదనలు దేశంలో పెట్టుబడులను ఏ విధంగా ప్రభావితం చేశాయనేది కీలకంగా మారింది. కొత్త పెట్టుబడి ప్రతిపాదనలతో ప్రభుత్వాలను వ్యాపారవేత్తలు ఎంత విశ్వసిస్తున్నారో తెలుస్తుంది. కేంద్రంలో ఏఏ ప్రభుత్వాల హయాంలో ఎన్ని కొత్త పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) క్రోడీకరించింది. ఇందులో కొన్ని నివ్వెరపరిచే నిజాలు వెలికి వచ్చాయి.

గత రెండు ప్రభుత్వాల హయాంలో క్రమంగా కొత్త పెట్టుబడి ప్రతిపాదనలు తగ్గుతున్నట్టు సీఎంఐఈ డేటా ద్వారా స్పష్టమవుతోంది. యుపిఏ-1 పరిపాలన కాలంలో ఏడాదికి మొత్తం రూ.18,958 బిలియన్ల పెట్టుబడుల్లో, పెట్టుబడుల రేటు తగ్గి ఏడాదికి రూ.15,582 బిలియన్లుగా ఉంది. 

ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెరిగి ఏడాదికి దాదాపుగా రూ.7.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అయితే ప్రైవేట్ పెట్టుబడుల్లో తరుగుదలను ఇవి పూరించలేకపోయాయి. ఎన్డీఏ-2 రోడ్లు, మౌలికవసతుల రంగంలో చెప్పుకోదగిన పెట్టుబడులు పెట్టింది. ఆర్థిక సంవత్సరం 15-19 కాలంలో ఏడాదికి 21% చొప్పున రోడ్ల నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపులు జరిపింది. బడ్జెట్ కేటాయింపులు ఆర్థిక సంవత్సరం 15లో 6.6 బిలియన్ డాలర్ల నుంచి పెరుగుతూ ఆర్థిక సంవత్సరం 17లో 17 బిలియన్ డాలర్లకు పైగా చేరుకున్నాయి. అయితే దీనికి ప్రైవేట్ రంగం నుంచి అదే స్థాయిలో మద్దతు లభించలేదు. ప్రైవేట్ రంగ పెట్టుబడులు దాదాపు 35 శాతం పడిపోయాయి. గత రెండు పంచవర్ష ప్రణాళికల్లో ఏడాదికి రూ.11.83 లక్షల నుంచి రూ.7.9 లక్షల కోట్లకు పతనమయ్యాయి.

తక్కువ సామర్థ్య వినియోగం, తగ్గిన డిమాండ్ కారణంగా ప్రైవేట్ రంగంలో పెట్టుబడి ప్రతిపాదనలు తగ్గాయి. బిజినెస్ సెంటిమెంట్ కొనసాగడంతో యుపిఏ-1లో 62 శాతానికి పైగా ఉన్న ప్రైవేట్ రంగం వాటా ఎన్డీఏ-2లో 50 శాతానికి కొద్దిగా ఎక్కువ ఉంది. యుపిఏ-1 పాలనలో పెట్టుబడులకు అన్ని పరిస్థితులు ఫల దశకు చేరుకోవడంతో పెట్టుబడుల్లో పెరుగుదల కనిపించిందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అయితే గత 15 ఏళ్లలో జీడీపీ రెండింతలు పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా కీలకమైన ఎగుమతులపై ఇప్పటికైనా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

కొత్త పెట్టుబడులను రంగాలవారీగా విశ్లేషిస్తే రియల్ ఎస్టేట్, ఎలక్ట్రిసిటీ రంగాలు దారుణంగా పతనమైనట్టు స్పష్టమవుతోంది. యుపిఏ-1 కాలంలో ఈ రంగాల్లో భారీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. అయితే గత ఐదేళ్లలో ఓవర్ కెపాసిటీ, నిధుల సమస్యల కారణంగా పెట్టుబడులు మందగించాయి. మైనింగ్, విద్యుత్ రంగాల్లో పెట్టుబడులు దాదాపు సగానికి పడిపోయాయి. ఏడాదికి రూ.6.2 లక్షల కోట్ల స్థాయి నుంచి రూ.3.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మాన్యుఫాక్చరింగ్ లో కూడా నిలకడైన తరుగుదల నమోదైంది. రోడ్లు, విమానయాన రంగాల్లో బలమైన పెట్టుబడులు రావడంతో సేవా రంగం మాత్రం వృద్ధిని నమోదు చేసింది.

రావాల్సిన పెట్టుబడుల్లో నికర పెరుగుదల బాగా పతనం కావడం ఆందోళన కలిగిస్తోంది. యుపిఏ-1లో కొత్త, పునరుద్ధరించిన పెట్టుబడుల నిష్పత్తి, పూర్తిచేసిన నిలిపేసిన, వదిలేసిన ప్రాజెక్టులతో పోలిస్తే 5 రెట్లుగా ఉంది. ఎన్డీఏ-2 హయాంలో ఇది 1 కంటే తక్కువకు  తగ్గింది. సరళంగా చెప్పాలంటే పాత పెట్టుబడులు పూర్తిచేసినవి, నిలిపేసినవి, వదిలేసిన వాటితో పోటీస్తే కొత్త పెట్టుబడుల వేగం బాగా నెమ్మదించింది. గత ఐదేళ్లలో కీలకమైన ప్రక్షాళన, బలోపేతం చేసే చర్యలు చేపట్టడం జరిగిందని, ప్రక్షాళన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని విశ్లేషకులు తెలిపారు. గత మూడు ప్రభుత్వాల పాలనలో ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు బాగా పడిపోయినట్టు చెబుతున్నారు. యుపిఏ-1 కాలంలో గత ఐదేళ్లలో ప్రైవేట్ రంగం పెట్టుబడులతో పోలిస్తే 8 రెట్లు ఎక్కువ ఉంది. అయితే యుపిఏ-2 పాలనలో ఎదురైన సమస్యలను ప్రైవేట్ రంగానికి ఇప్పుడు ఎదురవడం లేదు. నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించినప్పటికీ ఐబీసీపై ఎక్కువ ఆధారపడటం, ట్విన్ బీసీ సమస్యలు సృష్టిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.