మేం కోరేది ఒక్కటే...

మేం కోరేది ఒక్కటే...

మేం కోరేది ఒక్కటే ఢిల్లీలో పాలన సజావుగా సాగేలా చేయాలని అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... ఆందోళన చేస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కర్ణాటక సీఎం కుమారస్వామితో కలిసి సంయుక్తంగా లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాసిన ఏపీ సీఎం... అననుమతి ఇవ్వకపోవడంతో అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి ఆయన భార్యను, పిల్లలను కలిశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు... ప్రజల చేత ఎన్నుకోబడిన సీఎం కేజ్రీవాల్... ఢిల్లీ సీఎం డిమాండ్లను లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా పరిశీలించి, పరిష్కరించాలని కోరారు. రాజకీయాలు ఎప్పుడూ ఉండేవే... కానీ, లెఫ్టినెంట్ గవర్నర్ తక్షణమే పాలనకు సహకరించాలని కోరారు చంద్రబాబు.

ఇక ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కేజ్రీవాల్ కు మద్దతు ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చినట్టు స్పష్టం చేశారు కుమారస్వామి... కేంద్రం దేశ రాజధాని ఢిల్లీ ప్రభుత్వానికి ఎదురైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ప్రవర్తిస్తుందని మండిపడ్డారు కేరళ సీఎం పినరయి విజయన్... సమాఖ్య స్ఫూర్తిని మోడీ ప్రభుత్వం ధ్వంసం చేస్తుందని ఆరోపించిన ఆయన... ప్రజా పాలనకు ఆటంకం కలిగించకూడదు.. కేజ్రీవాల్ నిరసనకు మద్దతు తెపుతామన్నారు విజయన్. మరో వైపు సమస్యలు ఎక్కిడివి అక్కడే పేరుకుపోతున్నాయన్నారు మమతా బెనర్జీ... రాజకీయాలు ఎప్పుడూ ఉండేవే... కానీ, లెఫ్టినెంట్ గవర్నర్‌ని కలవడానికి కూడా సీఎంకే సమయం ఇవ్వడంలేదన్నారు. దేశరాజధానిలో కాలుష్యం పెరిగిపోతుంది... ప్రజలకు ఇష్టం ఉంటే మిమ్మల్ని ఎన్నుకుంటారన్న మమత... నాలుగు నెలల నుంచి  లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేజ్రీవాల్ 6 రోజుల నుంచి నిరసన తెలుపుతున్నా, కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారామె. కేజ్రీవాల్ ను కలిసేందుకు లేఖ రాసి 3, 4 గంటలు ఎదురుచూసినా అనుమతి ఇవ్వలేని విమర్శించిన మమత బెనర్జీ... ప్రజల చేత ఎన్నుకోబడిన సీఎం కేజ్రీవాల్ కు గౌరవం ఇవ్వాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన రాష్ట్రాలను కేంద్రం పట్టించుకుంటుందా? అని ప్రశ్నించారామె.