ఎల్బీ స్టేడియం ముందు కోచ్ ల ధర్నా...

ఎల్బీ స్టేడియం ముందు కోచ్ ల ధర్నా...

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం ముందు శాట్స్  కోచ్ లు మెరుపు ధర్నాకు దిగ్గారు. 27 ఏళ్లుగా ఒప్పంద కోచ్ లగా పని చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలంటూ శాట్స్ కోచ్ లు నిరసన  చేస్తున్నారు. తమని రెగులరైజ్ చేయాలంటూ ధర్నా కి దిగ్గారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కాంట్రాక్ట్ కోచ్ లు. సాట్స్ చైర్మన్ అల్లిపూరం వెంకటేశ్వర్ రెడ్డి ని లోపలికి రాకుండా కారుకు అడ్డం పద్దుకున్నారు కోచ్ లు. 28 ఏళ్లుగా కాంట్రాక్ట్ బేస్డ్ గానే పని చేస్తున్నాము. రెగులరైజ్ చేయాలని ప్రభుత్వ పెద్దలని ఎన్ని సార్లు వేడుకున్న స్పందన లేదు. తెలంగాణ వచ్చాక అయిన తమ బతుకులు బాగుపడతాయి అనుకుంటే... సీన్ రివర్స్ అయిపోయింది. తమకు జీతాలు కూడా టైమ్ కి ఇవ్వట్లేదు. తెలంగాణ ఏర్పడ్డాక కోచ్ లకి గాని, క్రీడలకు గాని రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అని అన్నారు. 

రాష్ట్రంలో 33 జిల్లాలో 330 మంది కోచ్ లు అవసరం ఉంటే... మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది కేవలం 4 రెగులర్ కోచ్ లు మాత్రమే. అదే స్పోర్ట్స్ మినిస్ట్రీ, శాట్స్ అడ్మినిస్ట్రేషన్ లో మాత్రం 200 మంది ఉన్నారు. ఇదెక్కడి న్యాయం.?. వేరే శాఖల్లో రిటైర్ అయిన వాళ్ళని... వేళల్లో జీతాలిస్తూ కన్సల్టెంట్, అద్వజర్ పేరుతో శాట్స్ లో నియమిస్తున్నారు. శాట్స్ ఛైర్మెన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి  సైతం మా సమస్యలనుపట్టించుకోడు. అడిగితే మమ్మల్నే టార్గెట్ చేస్తున్నాడు. తమ సమస్యలను పెడచెవిన పెడుతున్న ఛైర్మెన్ వెంటనే రాజీనామా చెయ్యాలి. మూడు నెలల ముందు కేటీఆర్ గారు... మా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అయిన ఎక్కడి ఫైల్స్ అక్కడే ఉన్నాయి. మా సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకే ధర్నా చేస్తున్నాము. చైర్మెన్ వచ్చే వరకు ధర్నా ని ఆపే ప్రసక్తే లేదు. శాట్స్ కాంట్రాక్ట్ కొచెస్ అసోసియేషన్ అధ్యక్షురాలు సత్యవని ఆత్మహత్య చేసుకుంటా అని లెటర్ రాసింది. ఆమెకి ఏమైనా జరిగితే.. చేర్మెన్, మినిష్టర్ లదే బాధ్యత అని పేర్కొన్నారు.