కోబ్రా పోస్ట్ స్టింగ్: బ్లాకైనా.. వైటయినా.. వివేక్ రెడీ..!!!

కోబ్రా పోస్ట్ స్టింగ్: బ్లాకైనా.. వైటయినా.. వివేక్ రెడీ..!!!

మరో కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.  ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి.  ఎన్నికల ప్రచారంలో గ్లామర్ అవసరం అవుతుంది.  అందుకే పార్టీలు సినిమా గ్లామర్ ను వినియోగించుకుంటుంటారు.  ఎన్నికల సమయంలో వారు సపోర్ట్ చేసే పార్టీల గురించి ట్వీట్ చేయడం సహజమే.  సెలెబ్రిటీల ట్వీట్ కు చాలా పవర్ ఉంటుంది.  లక్షలాది మందికి చేరువౌతుంది.  చిన్నా పెద్దా ఎవరైనా కావొచ్చు.  సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటె చాలు.  

సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కు మిగతా వాళ్లతో పోల్చుకుంటే.. ఫాలోయింగ్ తక్కువే అని చెప్పాలి.  ట్విట్టర్లో 20 లక్షలు, పేస్ బుక్ లో 99 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.  మైక్రో బ్లాగింగ్ ఇంస్టాగ్రామ్ లో 4 లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు.  ఇది తక్కువే అని చెప్పాలి.  

అసలు విషయం ఏమంటే.. బాలీవుడ్ సెలెబ్రిటీలు, సింగర్స్ పై స్టింగ్ ఆపరేషన్ ను నిర్వహించింది.  పార్టీల తరపున సెలెబ్రిటీల సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు డబ్బులు తీసుకుంటున్నారనే విషయాన్ని కోబ్రా పోస్టింగ్ బయటపెట్టింది.  వివేక్ ఒబెరాయ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాలను తన ట్విట్టర్ ద్వారా ప్రచారం చేసి, ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువయ్యేలా చేసేందుకు నెలకు రూ.80 లక్షలు డిమాండ్ చేశారని, అందులో 15 % మాత్రమే అంటే రూ.12 లక్షల రూపాయలు అగ్రిమెంట్ లో ఉండాలని, మిగతా మొత్తం బ్లాక్ రూపంలో ఇవ్వాలనే ఒప్పందం కుదిరిందని కోబ్రా పోస్ట్ తెలియజేసింది.  ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.