'కలెక్షన్ కింగ్' మోహన్ బాబుకు లక్ష జరిమానా

'కలెక్షన్ కింగ్' మోహన్ బాబుకు లక్ష జరిమానా

మోహన్ బాబు.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నెగిటివ్ రోల్స్ తో కెరీర్ ను ప్రారంభించి.. ఆ తరువాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఒకానొక దశలో ఈయన విలన్ గా చేస్తున్న సినిమాలో కూడా హీరోతో సమానంగా పారితోషికం అందుకున్నాడు.

కాగా, తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జరిమానా విధించారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో ఉన్న ఫిలింనగర్‌లో ఉన్న మోహన్ బాబు ఇంటి ముందు అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డు ఉంది. నేల నుంచి ఏకంగా 15 అడుగుల ఎత్తులో ఆ బిల్ బోర్డ్ ఉండడంతో.. దాని మీద కొందరు కంప్లైంట్ ఇచ్చారు. అందుకుగాను, ఆయనకు రూ. లక్ష జరిమానా విధించారు అధికారులు. జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి రాతపూర్వక అనుమతి లేకుండా ప్రకటన బోర్డును ఏర్పాటు చేసినందుకు ఈ మేరకు జరిమానా విధిస్తున్నట్టు ఆ జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు.