నిఫా వైరస్ కలకలంపై కలెక్టర్ స్పందన.. 

నిఫా వైరస్ కలకలంపై కలెక్టర్ స్పందన.. 

మదనపల్లెకి చెందిన మహిళా వైద్యరాలికి నిఫా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమనాలపై తిరుపతి కలెక్టర్ ప్రద్యుమ్న స్పందించారు. కేరళలోని నిఫా రోగికి వైద్యం చేయటంతో నిఫా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో డాక్టర్లు పర్యవేక్షణలో ఉంచారు.  తిరుపతి మదనపల్లెకి చెందిన మహిళ వైద్యరాలికి నిఫా వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానంతో అబ్జర్వేషన్ లో ఉంచారు తప్ప.. జిల్లాలో ఒక్క నిఫా కేసు కూడా నమోదు కాలేదని.. ఈ విషయంపై ప్రజలు భయపడాల్సిన పనిలేదని కలెక్టర్ వివరించారు. కాసేపట్లో రుయా ఆసుపత్రికి వెళ్లి మహిళా వైద్యరాలిని కలెక్టరు పరామర్శించనున్నారు.