అప్పటివరకు ఉన్నత విద్యాసంస్థలు బంద్ :యూజీసీ

అప్పటివరకు ఉన్నత విద్యాసంస్థలు బంద్ :యూజీసీ

కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలతో పాటు విద్యారంగం కూడా భారీగా నష్టపోయూయింది. మార్చ్ 25 నుండి దేశంలో అన్నిస్థాయిల విద్యాసంస్థలు మూతపడ్డాయి. అయితే పాఠశాలలు, ఇంటర్ విద్యాసంస్థలు కరోనా తగ్గే వరకు తెరుచుకోలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో ప్రత్యామ్నాయంగా ఆన్లైన్ విద్యను ప్రోత్సహించే దిశగా పలు రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. కాగా ఇప్పుడు తాజాగా ఈనెల 31వరకు ఉన్నత విద్యాసంస్థలన్ని బంద్ చేయాలని యూజీసీ (యునైటెడ్ గ్రాంట్ కమిషన్ )ఆదేశించింది. ఈ మేరకు దేశంలోని అన్ని కాలేజీలు, యూనివర్సిటీలు పాటించాలని యూజీసీ ఛైర్మెన్ రాజనీశ్ జైన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 31వరకు అన్ని కాలేజీలను,లైబ్రరీలను మూసి ఉంచుతున్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ స్పష్టం చేసింది.