సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా కోచ్‌..!

సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా కోచ్‌..!

క్రికెట్‌ మ్యాచ్‌ జరగుతున్నప్పుడు ఫీల్డింగ్‌ చేస్తున్న ప్లేయర్‌ గాయపడితే అతని బదులుగా మరో ఆటగాడు గ్రౌండ్‌లోకి వస్తాడు. ఐతే.. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన వరల్డ్‌కప్‌ వామప్‌ మ్యాచ్‌లో ఏకంగా అసిస్టెంట్‌ కోచ్‌ ఫీలింగ్‌ చేశాడు. ఫీల్డింగ్‌ చేస్తూ మార్క్‌వుడ్ గాయపడగా.. అతని స్థానంలో జోఫ్రా ఆర్చర్‌ వచ్చి ఫీల్డింగ్‌ చేశాడు. ఆర్చర్‌ కూడా గాయపడడంతో మరో ప్రత్యామ్నాయం లేక ఇంగ్లండ్‌ అసిస్టెంట్‌ కోచ్‌ కాలింగ్‌వుడ్‌ గ్రౌండ్‌లోకి వచ్చాడు. 42 ఏళ్ల కాలింగ్‌వుడ్‌.. నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అయినప్పటికీ ఫుల్‌ ఫిట్‌గా ఉండడంతో 'సబ్‌స్టిట్యూట్‌'గానూ పనికొచ్చాడు.