ఈ బర్గర్ ధర అక్షరాలా రూ.4వేలు... స్పెషల్ ఏంటో తెలుసా? 

ఈ బర్గర్ ధర అక్షరాలా రూ.4వేలు... స్పెషల్ ఏంటో తెలుసా? 

ఈ మోడ్రన్ కాలంలో ప్రజలు ఫాస్ట్ ఫుడ్ కు బాగా అలవాటు పడ్డారు.  ఫాస్ట్ ఫుడ్ లో కూడా పిజ్జా, బర్గర్ లను ఎక్కువ లైక్ చేస్తుంటారు.  మనదేశంలో బర్గర్లను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు.  వీటిల్లో ఎన్నో రకాలు ఉన్నాయి.  ఇక ప్రపంచంలో నిత్యం కొత్త కొత్త రకాల బర్గర్లను ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నారు.  వాటిల్లో ఒకటి ఒరో మెక్ కోయ్ అనే బర్గర్ ను ఇటీవలే ఇంట్రడ్యూస్ చేశారు.  దీనిని కొలంబియా దేశంలోని ఓ రెస్టారెంట్ తయారు చేసింది.  ఇది అన్ని బర్గర్లు మాదిరిగా కాకుండా కాస్త వెరైటీగా ఉంటుంది.  దీనిని డబుల్ మీట్, బేకన్, చీజ్ లతో పాటుగా దీనిపై 24 క్యారెట్ల బంగారాన్ని పూతగా పూస్తారు. 24 క్యారెట్స్ బంగారంతో తయారు చేసిన బర్గర్ కాబట్టి దీని ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. దీని ధర రెండు లక్షల కొలంబియన్ పెసోలుగా నిర్ణయించారు. మన ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే దీని ధర రూ.4191 అన్నమాట.  ఒక విధంగా ఈ ధర ఎక్కువే అయినప్పటికీ బంగారం పూతతో లభించే బర్గర్ కాబట్టి రుచి చూడవచ్చు.