'జీ' కోనుగోలుకు అమెరికా కేబుల్‌ దిగ్గజం ప్రయత్నాలు 

'జీ' కోనుగోలుకు అమెరికా కేబుల్‌ దిగ్గజం ప్రయత్నాలు 

జీ ఎంటర్‌టైన్మెంట్‌లో ప్రధాన వాటా కొనుగోలు చేసేందుకు అంతర్జాతీయంగా పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందు కోసం అమెరికాకు చెందిన కేబుల్‌ దిగ్గజం కామ్‌కాస్ట్‌ నేతృత్వంలోని కన్సార్షియం ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది.  ప్రైవేట్‌ ఈక్వీటీ సంస్థ బ్లాక్‌ స్టోన్‌, జేమ్స్‌ మర్డోక్స్‌ లుపా సిస్టమ్స్‌ ఈ కన్సార్షియంలో భాగస్వాములుగా ఉన్నాయి. కామ్‌కాస్ట్‌ ఇప్పటికే బిడ్‌ సమర్పించిందని.. ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని తెలిసింది. 

మరో వైపు.. తమకు ఎటువంటి బిడ్‌లు రాలేదని జీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. బ్రియాన్‌ రాబర్ట్స్‌ నేతృత్వంలోని కామ్‌కాస్ట్‌.. ఇటీవల కాలంలో అనేక మీడియా సంస్థలను, కంటెంట్‌ ప్రొవైడర్లను కొనుగోలు చేస్తూ వస్తోంది. కేబుల్‌ నెట్‌వర్క్స్‌, బ్రాండ్‌బాండ్‌ ప్రొవైడర్స్‌, యానిమేషన్‌ స్డూడియోల క్రయవిక్రయాలపై దృష్టి పెట్టింది. ఇండియాలో ప్రధాన మీడియా సంస్థను దక్కించుకునేందకు ప్రణాళికలతో ఉన్న కామ్‌కాస్ట్.. 'జీ'ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది.