ఢిల్లీ లో బీజేపీ పెద్దలను కలిసిన అలీ.. అందుకోసమేనా..?

ఢిల్లీ లో బీజేపీ పెద్దలను కలిసిన అలీ.. అందుకోసమేనా..?

టాలీవుడ్ కమెడియన్ అలీ బీజేపీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. దాంతో ఆయన పార్టీ మారుతున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఈ సమయంలో అలీ బీజేపీ ఆఫీసులో కనిపించడంతో ఆ వార్తకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై అలీ వివరణ ఇచ్చారు. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అలీ చెప్పారు. ఓ హాలీవుడ్ డైరెక్టర్ త్వరలో భారత్‌ రాబోతున్నారని,ఆయన ప్రధాని మోడీని కలవాలని భావిస్తున్నారని, ఆయన కోసమే ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకోవాలని ఢిల్లీకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ ను కలిసి అపాయింట్‌మెంట్ గురించి చర్చించానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు అలీ చెప్పారు. కాగా ఎన్నికల సమయంలో అలీ వైసీపీ పార్టీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.