నటుడు పృధ్వీ రాజ్ కు తీవ్ర అస్వస్థత

నటుడు పృధ్వీ రాజ్ కు తీవ్ర అస్వస్థత


తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ సినిమా నటుడు పృథ్వి రాజ్ హాస్పిటల్ లో చేరారు. గత 10 రోజులుగా తీవ్రమైన జ్వరంతో ఆయన బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ నెగిటివ్ వచ్చినపటికి 15 రోజులు ఐసోలాషన్ లో ఉండమని డాక్టర్ లు సలహా ఇచ్చిన మేరకు పృథ్వి ఆసుపత్రిలో చేరినట్టు చెబుతున్నారు. శ్వాసకోశ సమస్య తలెత్తడంతో ఆక్సిజన్ ద్వారా శ్వాస తీసుకుంటున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ చేశారు. నిముషం నిడివి ఉన్న ఆ వీడియోలో ప్రజల ఆశీర్వాదాలు కావాలంటూ పృథ్వి కోరారు. అయితే లాక్ డౌన్ వలన చాలా కాలం ఇంటికే పరిమితం అయిన ఆయన అనంతరం ఇచ్చిన సడలింపులతో బయటకు వచ్చారు. కొన్ని షూటింగ్స్ లో కూడా అయన పాల్గొన్నట్టు సినీ వర్గాల నుండి అందుతోన్న సమాచారం. ఆయన వీలయినంత త్వరగా కోలుకుని మళ్ళీ నవ్వించాలని కోరుకుందాం !