ప్రముఖ కమెడియన్ కు మాతృవియోగం

ప్రముఖ కమెడియన్ కు మాతృవియోగం

టాలీవుడ్ లో టాప్ కమెడియన్లలో ఒకరు వివేక్.  కమెడియన్ గా సినిమాలు చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు హీరోగా నిరూపించుకుంటున్నారు.  ఇదిలా ఉంటె, వివేక్ తల్లి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆమె, కొన్ని రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు.  

నిన్నటి వరకు బాగానే ఉన్న ఆమె ఈ రోజు ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు.  వివేక్ తల్లి మరణ వార్తా విన్న కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.  కొన్నాళ్ల క్రితం వివేక్ కొడుకు మరణించిన సంగతి తెలిసిందే.  ఆ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ఇలా జరగడం దురదృష్టకరమే అని చెప్పాలి.  

వివేక్ ను బాలచందర్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.  రజినీకాంత్, కమల్ హాసన్ లతో వివేక్ కు మంచి అనుబంధం ఉంది.  సూర్య సింహం సీరీస్ లో మంచి పాత్రను పోషించి మెప్పించారు.