300 సీట్లు గెలుస్తామంటే ఎగతాళి చేశారు: మోడీ

300 సీట్లు గెలుస్తామంటే ఎగతాళి చేశారు: మోడీ

1942-1947లా వచ్చే ఐదేళ్లు కూడా దేశానికి అత్యంత కీలకమని ప్రధాన మంత్రి మోడీ అన్నారు. బీజేపీ ఘన విజయం తర్వాత ఆయన తొలిసారిగా ఇవాళ గుజరాత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ గొప్ప విజయం తమపై బాధ్యతను పెంచిందన్నారు. ఈ ఐదేళ్లనూ సామాన్య ప్రజల సమస్యలు తీర్చడానికి వినియోగిస్తామన్నారు. తమకు 300పైగా సీట్లు వస్తాయని ప్రచార సమయంలో తాను వ్యాఖ్యానించగా.. కొందరు తనను ఎగతాళి చేశారని గుర్తు చేశారు.  

సూరత్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు ఆయన సంతాపం ప్రకటించారు.  సూరత్‌లో ప్రమాదం నేపథ్యంలో విచారకర, గందరగోళ పరిస్థితిని ఎదుర్కొన్నానని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలా..? వద్దా..? అని డైలమాలో పడ్డానని..  ఒకవైపు నా కర్తవ్యం.. ఒకవైపు కరుణ. కొన్ని కుటుంబాలు వాళ్ల పిల్లల్ని.. వారి భవిష్యత్తును కోల్పోయాయి. ఆ పిల్లల కుటుంబాలకు ఆ దేవుడు మరింత బలాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని మోడీ తెలిపారు.

ఇక.. గుజరాత పర్యటనలో భాగంగా మోడీ.. ముందుగా  సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ విగ్రహాన్ని సందర్శించిన సందర్శించి నివాళులు అర్పించారు.