మీ అబ్బాయి బాగా ఆడుతున్నాడు: హర్షా భోగ్లే

మీ అబ్బాయి బాగా ఆడుతున్నాడు: హర్షా భోగ్లే

ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఆంధ్రా ఆటగాడు హనుమ విహారిని ప్రశంసించారు. ఇంగ్లాండ్‌, భారత్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో హనుమ విహారి అర్ధ శతకంతో అదరగొట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే.. 124 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 56 పరుగులు చేసాడు. ఈ సందర్భంగా హర్షా భోగ్లే.. హనుమ విహారి తల్లికి ఓ ట్వీట్ చేసాడు. ' విజయలక్ష్మి గారు మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు' అని ట్వీటాడు.

భారత జట్టు క్రికెట్ మ్యాచ్‌లు ఆడే సమయంలో అభిమానులు కామెంటేటర్ల రూపంలో ఎక్కువగా వినే గొంతు కామెంటేటర్ హర్షా భోగ్లేదే. అయితే ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కామెంటేటర్ గా హర్షా భోగ్లే కనిపించడం లేదు.