బిల్కిస్‌ బానో కేసులో సుప్రీం సంచలన తీర్పు

బిల్కిస్‌ బానో కేసులో సుప్రీం సంచలన తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచారం కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇవాళ ఈ పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. ఆమెకు రూ.50 లక్షల నష్టపరిహారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు ఇవ్వాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు వారాల్లోగా ఇది అమలు చేయాలని స్పష్టం చేసింది. 

గోద్రా అల్లర్ల తర్వాత అహ్మదాబాద్ సమీపంలోని రంధిక్‌పూర్ గ్రామానికి చెందిన బిల్కిస్ బానో కుటుంబంపై దుండగులు దాడి చేసి ఎనిమిది మందిని హత్య చేశారు. గర్భవతి అయిన బిల్కిస్ బానో, ఆమె తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అత్యంత పాశవికంగా వ్యవహరించారు. ఈ కేసులో దోషులుగా నిర్ధారించిన 12 మందికి బాంబే హైకోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. మరో ఏడుగురిని నిర్దోషులుగా విడిచిపెట్టింది.