టెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి

టెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణాంగా టెట్ ను ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షల  నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా.. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలను తీసుకున్నామన్నారు. జూన్ 10 నుంచి 19 వరకు పరీక్షలు జరగనున్నాయని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఉదయం 9.30 నుంచి మ.12.30 వరకు ఒక సెషన్, మధ్యాహ్నాం 2.30 నుంచి 4.30 వరకు మరో సెషన్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సారి టెట్ కు 3,97,957 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,83,066 మంది ఆప్షన్స్ పెట్టుకున్నారని పేర్కొన్నారు. అభ్యర్థులు వారు సూచించిన ప్రకారమే  సెంటర్ల ఎంపిక ఉంటుందన్నారు. మొత్తం 113 కేంద్రాల్లో ఈ టెట్ పరీక్షను నిర్వహిస్తున్నామన్నారు. ఆంద్రాతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో కూడా టెట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

జూన్ 5 మధ్యాహ్నాం 12 గంటల నుండి హాల్ టిక్కెట్ డౌన్ లోడింగ్ ప్రక్రియ ప్ర్రారంబమైందని.. టెట్ వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకుంటున్నారని మంత్రి గంటా తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఎవరికైనా సందేహాలు ఉంటె 9505619127,  9505780616, 9505853627 నంబర్లకు డయల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మొత్తం 10,351 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, వీటిని ఏపిపిఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు. 
# ఎస్జిటి- 4,967
# స్కూల్ అసిస్టెంట్ : 2,978
# లాంగ్వేజ్ పండిట్ : 312
# పీఈటీ: 1056
జూలై 6 న డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. జూలై 7 నుండి ఆగష్టు 9 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆగస్టు 15 నుండి హాల్  టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 24, 25, 26 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రాధమిక కీ ఆగష్టు 27 న విడుదల చేస్తామని తెలిపారు. ఆగస్టు 27 నుండి  సెప్టెంబరు 7 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. సెప్టెంబరు 10న ఫైనల్ కీ.. సెప్టెంబరు 15న ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి గంటా అన్నారు.