18న ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌?

18న ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) పూర్తి షెడ్యూల్‌ మరో రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. దేశంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ తొలి రెండు వారాల షెడ్యూల్‌ని మాత్రమే అధికారులు విడుదల చేసారు. లోక్‌సభ ఎన్నికల తేదీలు ఖరారు కావడంతో.. మిగిలిన షెడ్యూల్‌ పై సీఓఏ, బీసీసీఐ సోమవారం (మార్చ్ 18న) సమావేశం కానుంది. ఈ సమావేశం అనంతరం ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్‌ 12వ సీజన్ ఈ నెల 23న చెన్నైలో ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్య జరుగుతుంది.