బ‌న్నికి పూజా కాంప్లిమెంట్

బ‌న్నికి పూజా కాంప్లిమెంట్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బ‌న్ని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానులు ఒక్కొక్క‌రూ ఒక్కో ర‌కంగా శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. విశాఖ ఆర్కే బీచ్‌లో బ‌న్ని అభిమానులు ప్ర‌త్యేకించి త‌మ అభిమాన హీరో సినిమా టైటిల్‌ని సైక‌త శిల్పంగా రూపొందించారు. ఇది జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అయ్యింది. మ‌రోవైపు సామాజిక మాధ్య‌మాల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేష‌న్స్ సంద‌డి మామూలుగా లేదు. ఎక్క‌డికక్క‌డ న‌గ‌రాల్లో ప్ర‌త్యేకంగా కేక్‌లు క‌ట్ చేసుకుని సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటున్నారు. అదంతా స‌రే.. ముంబైకి చెందిన ఓ స్పెష‌ల్ లేడీ ఫ్యాన్ అదిరిపోయే కొటేష‌న్‌తో ట్వీట్ చేశారు. ఒకే ఒక్క‌సారి బ‌న్నితో అవ‌కావం వ‌చ్చింది. అది కూడా లుంగీలో స‌ర‌దా స‌ర‌దా అవ‌కాశం. ఏదోలా గాయాల‌వ్వ‌కుండా అప్ప‌టికి బాగానే మ్యానేజ్ చేసేశాం.. సెట్స్‌లో ఫ‌న్నీ మెమ‌రీస్‌.. అని గుర్తు చేసుకుంది ఈ ఫ్యాన్‌. ఇంత‌కీ ఆ ఫ్యాన్ ఎవ‌రో గుర్తొచ్చింది క‌దూ? `డీజే`లో బికినీతో ఓసారి, లుంగీతో ఇంకోసారి యూత్ గుండె కొల్ల‌గొట్టిన అమ్మ‌డు. ఈ ఏడాది కూడా బ‌న్ని మంచి విజ‌యాలు అందుకోవాల‌ని కోరుకుంటూ.. మ‌రిన్ని ఇలాంటి పుట్టిన‌రోజులు జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షించింది పూజా హెగ్డే. హ్యాపీ బ‌ర్త్‌డే అంటూ కేక్ సింబ‌ల్‌ని ట్విట్ట‌ర్‌లోనూ పోస్ట్ చేసింది. ఈ ట్వీట్‌లో `లెస్ హెడ్ బంప్స్‌` అంటూ బ‌న్నికి అదిరే కాంప్లిమెంట్‌ను ఇచ్చింది. https://twitter.com/hegdepooja/status/982895022361194496