క్లారిటీ వచ్చింది.. ఆ హీరోల మధ్య క్లాష్ లేదు...!!

క్లారిటీ వచ్చింది.. ఆ హీరోల మధ్య క్లాష్ లేదు...!!

రంజాన్ నెల వస్తుంది అంటే బాలీవుడ్ ప్రేక్షకులకు పండుగే పండుగ.  రంజాన్ రోజున సల్మాన్ సినిమా తప్పకుండా రిలీజ్ అవుతుంది.  మరో హీరో సినిమా రిలీజ్ కాదు.  వచ్చే రంజాన్ పండుగ రోజున సల్మాన్ ఇన్షా అల్లా తో పాటు అక్షయ్ కుమార్ సూర్యవంశీ కూడా రిలీజ్ కావాల్సి ఉంది. దీంతో ఈ ఇద్దరు హీరోల మధ్య తప్పకుండా క్లాష్ ఉండబోతుందని వార్తలు వచ్చాయి.  కానీ, ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.  

ఇద్దరు స్టార్ హీరోలు కంప్రమైజ్ అయ్యారు.  సినిమాను ఈద్ కు కాకుండా మే  27 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు సూర్యవంశీ దర్శకుడు రోహిత్ శెట్టి ప్రకటించాడు.  దీంతో సల్మాన్ ఖాన్ దర్శకుడు రోహిత్ శెట్టికి కృతజ్ఞతలు తెలియజేశారు.  సో, వచ్చే ఈద్ కు కేవలం సల్మాన్ ఇన్షా అల్లా సినిమా మాత్రమే రిలీజ్ అవుతుంది.