దలైలమాకు తీవ్ర అస్వస్థత..?

దలైలమాకు తీవ్ర అస్వస్థత..?

హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో స్థానిక అధికార సిబ్బంది మాక్‌ డ్రిల్‌ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆధ్యాత్మిక గురువులెవరైనా అనారోగ్యం బారిన పడితే ముందస్తు చర్యగా మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తారు. టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఇంటికి సమీపంలోని ప్రాంతం నుంచి స్థానిక ప్రధాన ఆస్పత్రి వరకు ఈ మాక్‌ డ్రిల్‌ నిర్వహించడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు మొదలయ్యాయి. ఓ అంబులెన్స్‌తోపాటు పదుల సంఖ్యలో వాహనాలు వరుసపెట్టి వెళ్లడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. కాగా.. దాదాపు ఏడాదిగా దలైలమా ఇతర దేశాలతోపాటు మన దేశంలోనూ పర్యటనలను తగ్గించేశారు.
83 ఏళ్ల దలైలామా ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ నెల రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. 48 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. అప్పటి నుంచి ఆయన ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు.