షీలాదీక్షిత్‌ పార్థివ దేహానికి ప్రముఖుల నివాళి

షీలాదీక్షిత్‌ పార్థివ దేహానికి ప్రముఖుల నివాళి

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు షీలా దీక్షిత్‌ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. నిజాముద్దీన్‌లోని షీలాదీక్షిత్‌ నివాసంలో ప్రధానమంత్రి మోడీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తదితరులు షీలాదీక్షిత్‌ పార్థివ దేహానికి నివాళులర్పించి సంతాపం తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షీలా దీక్షిత్‌.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు.