రాహుల్ సపోర్ట్.. అయోమయంలో పాక్ ..!!

రాహుల్ సపోర్ట్.. అయోమయంలో పాక్ ..!!

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ గతంలో పూర్తిగా వ్యతిరేకించింది.  కాంగ్రెస్ పార్టీతో సహా వాటి మిత్రపక్షాలు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.  మిత్రపక్షాల్లో ఉన్న కొన్ని పార్టీలు ఈ ఆర్టికల్ 370 రద్దును స్వాగతించడం.. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు కొందరు కాశ్మీర్ విషయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును మెచ్చుకోవడంతో పార్టీ అయోమయంలో పడింది.  సొంతపార్టీ నేతలు మోదీ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడంతో.. ఏం చేయాలో పాలుపోలేదు.  అదే సమయంలో రాహుల్ గాంధీ పాక్ కు మద్దతుగా ఉన్నాడని, కాశ్మీర్ విషయంలో పండిట్ నెహ్రులా పాక్ కు సపోర్ట్ గా ఉన్నారని చెప్పడంతో రాహుల్ షాక్ అయ్యాడు.  

వెంటనే రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ విషయంలో స్టేట్మెంట్ ఇచ్చాడు.  జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం అని, ఇండియా నుంచి వేరు చేయలేరని రాహుల్ గాంధీ చెప్పారు.  పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని రాహుల్ పేర్కొనడం విశేషం.  ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.  కాశ్మీర్ లోయలో పాకిస్తాన్ హింసను ప్రోత్సహిస్తోందని స్పష్టం చేసింది.  రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ తమ వైఖరిని స్పష్టం చేయడంతో పాక్ అయోమయంలో పడిపోయింది.  రాహుల్ ను అడ్డంపెట్టుకొని ఐక్యరాజ్య సమితిలో రగడ చేయాలనుకున్న పాక్ .. ఇప్పుడెలా స్పందిస్తుందో చూడాలి.