బీజేపీ, తెరాసలు తోడు దొంగలు... రేవంత్ సంచలన వ్యాఖ్యలు 

బీజేపీ, తెరాసలు తోడు దొంగలు... రేవంత్ సంచలన వ్యాఖ్యలు 

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఛలో రాజ్ భవన్ ను తలపెట్టింది. రాజ్ భవన్ కు పెద్ద ఎత్తున నేతలు తరలివస్తుండగా, పోలీసులు లుంబిని పార్క్ వద్ద అడ్డుకొని అరెస్ట్ చేశారు. అయితే, అరెస్ట్ కు ముందు రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.  రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుందని, ఇది ఆరంభం మాత్రమే అని అన్నారు.  వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు.  రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తెరాస పార్టీ ఎంపీలు మోడీవైపు ఉంటారా లేదంటే రైతుల వైపు ఉంటారో తేలిపోతుందని అన్నారు.  బీజేపీ, తెరాస పార్టీలు తోడు దొంగలని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.  మోడీకి, కేసీఆర్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు.  ఐకెపి సెంటర్లు ఏర్పాటు చేసి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని, ఆధాని, అంబానీ, అమెజాన్ కంపెనీల కోసం మూడు చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ నేత విమర్శించారు.  రిటుల జీవితాలపై మోడీ మరణశాసనం రాశారని, కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతొ కాలయాపన చేస్తున్నట్టు అయన పేర్కొన్నారు.  ఇక ఆందోళనలో  చనిపోయిన రైతు  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.  పలు సందర్భాల్లో మోడీకి కేసీఆర్ అండగా నిలబడ్డారని విమర్శించారు.  ఛలో రాజ్ భవన్ కి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులను పోలీలు అరెస్ట్ చేయడం చీకటి ఒప్పందంలో భాగమే అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.