జగన్ కు యూఎస్ కాన్సులేట్ అభినందనలు

జగన్ కు యూఎస్ కాన్సులేట్ అభినందనలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్ కు అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కాథరీన్‌ హడ్డా అభినందనలు తెలిపారు. ‘ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్‌ జగన్‌కు అభినందనలు. భవిష్యత్తులో అమెరికా, ఆంధ్రప్రదేశ్‌ మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు. గతంలో వైఎస్‌ జగన్‌తో దిగిన ఫోటోను ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు.