మోడీ, అమిత్ షాపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. 

మోడీ, అమిత్ షాపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. 

ఎన్నికల నియమావళి ఉల్లంఘన వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలపై దాఖలైన పిటిషన్‌ అత్యవసర విచారణకు సుప్రీం కోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్‌ను రేపు విచారణ చేస్తామని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ చెప్పారు. ఎన్నికల నియామవళిని ఉల్లంఘించినప్పటికీ మోడీ, షాలపై ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈసీకి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో..సుప్రీంను ఆశ్రయించారు