కర్ణాటకలో మరో కొత్త మలుపు.. కూటమిలో మళ్ళీ చీలికలు..!

కర్ణాటకలో మరో కొత్త మలుపు.. కూటమిలో మళ్ళీ చీలికలు..!

కర్ణాటకలో కాంగ్రెస్.. జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది.  దాని ప్లేస్ లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే.  ఇటీవలే జరిగిన బలపరీక్షలో యడ్యూరప్ప సర్కార్ విజయం సాధించింది.  అయితే, సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామా చేసిన 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. 

అనర్హత వేటు వేయడంతో.. అక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.  ఆరు నెలలలోపు ఉపఎన్నికలు జరుగుతాయి.  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి కలిసి పనిచేస్తుందా అంటే లేదని సమాధానం వస్తోంది.  కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పాటించేయాలని, జేడీఎస్ తో కలిసి పోటీ చేస్తే.. అది బీజేపీకి ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.  అయితే, జేడీఎస్ మాత్రం ఈ విషయంలో ఆచితూచి మాట్లాడుతోంది.  కలిసి పనిచేయడం చేయకపోవడం అన్నది కాంగ్రెస్ పార్టీ ఇష్టమని, ఆ విషయాలు దేవెగౌడ, సోనియా గాంధీలకు వదిలేస్తున్నామని కుమారస్వామి అంటున్నారు.