తిరుగుబాటు భయం: క్యాంప్ మారింది...

తిరుగుబాటు భయం: క్యాంప్ మారింది...

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ.. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ మేరకు 15 రోజుల గడువును ఇచ్చారు గవర్నర్ వాజుభాయ్ వాలా.. ఈ నేపథ్యంలో అందుకు అవసరమైన ఎమ్మెల్యేల బలాన్ని పొందేందుకు గానూ కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను తమ శిబిరం వైపు లాక్కొచ్చేందుకు బీజేపీ ఇప్పటికే ప్రలోభాల పర్వం మొదలుపెట్టడంతో.. కాంగ్రెస్-జేడీఎస్‌లు తమ శాసనసభ్యులను క్యాంపులకు తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈగిల్టన్ రిసార్ట్‌కు .. జేడీఎస్ శాంగ్రిలా హోటల్‌‌కు తమ సభ్యులను తరలించాయి. అయితే మాజీ స్పీకర్‌తో పాటు మరో ఎమ్మల్యే సిద్ధరామయ్యకు ఎదురు తిరగడంతో.. మిగిలిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి.. రాజీనామా చేస్తారనే భయంతో ఇరు పార్టీల ఎమ్మెల్యేలను బస్సుల్లో కొచ్చిన్‌కు తరలించారు.