సీట్లు మారాయి.. ముందుకు ఎంఐఎం.. వెనక్కి కాంగ్రెస్..

సీట్లు మారాయి.. ముందుకు ఎంఐఎం.. వెనక్కి కాంగ్రెస్..

తెలంగాణ అసెంబ్లీలో పార్టీల సీట్లు మారిపోయాయి... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. దీంతో, ఎంఐఎం ఎమ్మెల్యేలకు ముందు వరుసలో సీట్లు కేటాయించారు.. దీంతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు రెండో వరుసలో సీటు ఇచ్చారు. ప్రతిపక్ష హోదాల ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూర్చునే సీట్లను ఎంఐఎం ఎమ్మెల్యేలకు కేటాయించారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ ఘటనను చూసి ఒకింత షాక్ తిన్నారు.. కాంగ్రెస్ సభ్యులు వచ్చేసరికే వారి స్థానాల్లో ఎంఐఎం ఎమ్మెల్యేలు కూర్చోవడంతో.. గతంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు కూర్చునే స్థానాల్లో కాంగ్రెస్ సభ్యులు కూర్చున్నారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరడంతో అసెంబ్లీలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య ఆరుకు పడిపోగా.. ఎంఐఎం ఎమ్మెల్యేల సంఖ్య 7గా ఉంది. అయితే, అసెంబ్లీ జరిగిన తాజా పరిణామాలతో ఎంఐఎంను ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తున్నట్టుగా కనిపిస్తోంది.