ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి..

ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి..

బాన్సువాడలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సహా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ పార్టీ అప్రజాస్వామికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. ఓవైపు సీఎల్పీ విలీనంపై టీఆర్ఎస్ నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, సీఎల్పీ విలీనం వైపు జరుగుతోన్న ప్రయత్నాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సీఎల్పీ... ఇవాళ మరో నలుగురు ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్, సురేందర్,  ఉపేందర్ రెడ్డిలపై ఫిర్యాదు చేశారు.