అది చూసి మోడీకి భయంపట్టుకుంది..

అది చూసి మోడీకి భయంపట్టుకుంది..

ఎన్నికల్లో ఎవరి పొత్తులేకుండా కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆపార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జ్ కుంతియా స్పష్టం చేశారు. ఆదివారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాహుల్ గాంధీ అధ్యక్షతన నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అది చూసి మోడీకి భయంపట్టుకుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు పుల్వామా ఘటనలో అమరుల సహాకారం తీసుకునే దుస్థితి పట్టిందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సెక్యూలర్ పార్టీలా నటిస్తుందని అన్నారు. మోడీ బీ-టీమ్ కేసీఆర్ అని విమర్శించారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి చేసిందని కేటీఆర్ పొగరుతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.