అభ్యర్థుల కొరత కాంగ్రెస్‌కి లేదు: భట్టి

అభ్యర్థుల కొరత కాంగ్రెస్‌కి లేదు: భట్టి

 పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల కొరత కాంగ్రెస్‌కి లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పడి లేవటం కాంగ్రెస్‌కి కొత్తకాదు, తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ అంటే టీఆర్ఎస్ కి భయం పట్టుకుంది కాబట్టే.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సభతో తెలంగాణాలో ప్రచారం ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల కొరత కాంగ్రెస్‌కి లేదు. చాలా మంది పోటీ చేయడానికి వస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు తేడా ఉంది, ఫలితాలు కూడా తేడాగానే వస్తాయన్నారు. కాంగ్రెస్‌ చచ్చిపోదు.. కింద పడ్డా ఎగిసి పైకిలేస్తుందన్నారు.