కాంగ్రెస్‌ అసంతృప్తులకు ఢిల్లీ నుంచి పిలుపు..

కాంగ్రెస్‌ అసంతృప్తులకు ఢిల్లీ నుంచి పిలుపు..

మహాకూటమిలో సీట్ల పంపకాలపై స్పష్టమైన ప్రకటన రాకముందే కాంగ్రెస్‌లో అసంతృప్తులు ఎక్కువయ్యారు. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించేందుకు హైకమాండ్‌ రంగంలోకి దిగింది. యాక్షన్‌ ప్లాన్‌ ఖరారు చేసింది. సీట్లు రాని వారికి, కూటమి పక్షాల్లో సీట్లు కోల్పోనున్నవారికి ఢిల్లీ నుంచి త్వరలోనే పిలుపు అందింది. నామినేషన్ల కంటే ముందే ఈ బుజ్జగింపుల పర్వం ముగించాలని హైకమాండ్‌ భావిస్తోంది. దాదాపు 200 మందికి ఢిల్లీ నుంచి కబురందిందని సమాచారం.